లడ్డు కన్నయ్యను దర్శించుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Published on

-Advertisement-

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

పల్లకి ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే

తాంసి:మన భారత్, సెప్టెంబర్ 4,
మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడి పల్లకిని ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జీవితం ధర్మం, న్యాయం, సత్యం, కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ప్రపంచానికి అందించిన సందేశం నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

గ్రామంలో భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్, బీఆర్ఎస్ నాయకులు అభిరామ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి .

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this