బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Published on

-Advertisement-

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

చందర్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్

సోనాల:మన భారత్, సెప్టెంబర్ 1,సోనాల మండలంలోని గుట్టపక్క తండాకు చెందిన చందర్ సింగ్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

చందర్ సింగ్ నివాసానికి వెళ్లిన రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందర్ సింగ్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ అండగా ఉంటామని తెలిపారు.

కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని రాథోడ్ బాపురావు సూచించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల అధ్యక్షుడు రామయి సదానందం, నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్, సోనాల బీసీ సెల్ అధ్యక్షుడు దయాసాగర్, స్థానిక సర్పంచ్ బలివీర్ సింగ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల...

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి..

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మన...

More like this