తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీ చేరికలు..

Published on

-Advertisement-

గెర్జామ్‌లో 300 మంది పార్టీలో చేరిక..

కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు

మన భారత్, బోథ్:ఆగస్టు 26: బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గంలోని గెర్జామ్ గ్రామంలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 300 మంది గ్రామస్థులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర అబ్జర్వర్ రాథోడ్ బాపూరావు నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ గెర్జామ్ గ్రామంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణతో బోథ్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని విస్తరించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల సమస్యలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక అవసరాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం దృష్టి సారిస్తారని రాథోడ్ బాపూరావు పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

గెర్జామ్ గ్రామంలో జరిగిన భారీ చేరికలతో తెలంగాణ రక్షణ సేన పార్టీకి బోథ్ నియోజకవర్గంలో మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజలతో మమేకమవుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ బిలాల్, మైనారిటీ చైర్మన్ ఫరిద్, ఎండీ ఆషిఫ్, షేక్ మహమ్మద్, షేక్ ముస్తఫా, జడ్పీటీసీ హరన్ మారుతీ పటేల్, గ్రామ నాయకులు కనక లచుపటేల్, కొట్నాక్ మహదు, కొట్నాక్ లచ్చు, పెద్ది రవి, పెందుర్ ప్రభాకర్, కనక మానుకు, కనక సుంగు, మాజీ సర్పంచ్ సిదమ్ తులసీరాం, కొట్నాక్ శంకర్, కనక శ్రీనివాస్, కొట్నాక్ విశ్వనాథ్, కొట్నాక్ రమేష్, విజయ్, వసంత్, ఇసర్రు, గంగారాం, హనుమంతు, పెద్ది శేఖర్, పడేగాల రమేష్, పడిగేలా అనిల్, కత్తూరి ధర్మాన, నాగోరావు, కనక రాందాష్, ధరంపూరి కొమరం జంగుపటేల్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this