ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి: రవి పటేల్

Published on

-Advertisement-

ఆదివాసుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: రవి పటేల్

మన భారత్,మొగుళ్ళపల్లి:

ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ సోదర సోదరీమణులకు ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వీరుడు కొమురం భీమ్ స్ఫూర్తితో ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి, పోడు భూములు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు వంటి సమస్యలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు, హాస్టళ్లు, వైద్యసదుపాయాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆదివాసుల హక్కులను కేవలం ఆదివాసుల దినోత్సవం రోజున మాత్రమే గుర్తు చేసుకోకుండా, వారి హక్కులను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఆదివాసుల హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని రవి పటేల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆదివాసి సంఘం విభాగం అధ్యక్షుడు సంతోష్ ,ఆదివాసి జిల్లా ఉపాధ్యక్షుడు వెనుకాల ప్రణయ్ రాజ్ ,జిల్లా నాయకులు సామల చంద్రశేఖర్ ,భూక్య సమ్మయ్య ,నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this