తెలంగాణ ఉద్యమంలో పెద్దిదీ కీలకపాత్ర..

Published on

-Advertisement-

పెద్దికి ఘన నివాళులు

మన భారత్, మొగుళ్ళపల్లి:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటని తెలంగాణ రాష్ట్ర రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు ( నవత వెంకన్న) తెలిపారు. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మరణించారు.  శనివారం నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో గల పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి నవత వెంకన్న చేరుకొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నవత వెంకన్న మాట్లాడారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి, తన దైన శైలిలో ఓరుగల్లు జిల్లాలో ఉద్యమాన్ని ఉదృతం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో క్రీయాశీలక పాత్ర పోషించాడని పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరువేర్చుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిట్యాల వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని, అయన చేసిన సేవలను, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని నెమరువేర్చుకున్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this