e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

కరెంట్ షాక్‌తో హత్యకు కుట్ర భగ్నం..

కరెంట్ షాక్‌తో హత్యకు కుట్ర భగ్నం

ఇద్దరు నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు పరారీలో

హత్యకు ఉపయోగించేందుకు తెచ్చిన కరెంట్ వైర్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం

మన భారత్, ఆదిలాబాద్, ఆగస్టు 2: వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కరెంట్ షాక్‌తో హత్య చేసేందుకు పన్నిన కుట్రను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కుట్రకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

డబ్బు ఆశ చూపి కుట్రలోకి..

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకొలి గ్రామానికి చెందిన సుడగొణి సుధాకర్ గౌడ్‌ను హత్య చేయాలని ప్రధాన నిందితుడు మడిగం స్వామి కుట్ర పన్నినట్లు తెలిపారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ పథకాన్ని రూపొందించి, బడే రమేష్, పుల్లేడు గంగన్నలకు డబ్బు ఆశ చూపి తనతో కలిసి పనిచేసేలా ప్రేరేపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇంటి పైకప్పు నుంచి కరెంట్ వైర్

పథకంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో నిందితులు బాధితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి పైకప్పు మార్గం ద్వారా కరెంట్ వైర్‌ను బెడ్ వరకు తీసుకెళ్లి, విద్యుత్ ప్లగ్‌కు కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అనూహ్యంగా బాధితుడు ఇంటి నుంచి బయటకు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.

సాంకేతిక ఆధారాలతో పట్టుబడ్డ నిందితులు

ఘటనపై సమాచారం అందుకున్న ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పాటు నిందితులను విచారించిన అనంతరం బడే రమేష్, పుల్లేడు గంగన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హత్యకు వినియోగించేందుకు తీసుకొచ్చిన కరెంట్ వైర్, నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రహీం పాషా తెలిపారు.

ప్రధాన నిందితుడు పరారీలో..

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మడిగం స్వామిని గుర్తించిన పోలీసులు అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని, కేసుకు సంబంధించిన మిగిలిన అంశాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.

కేసును ఛేదించడంలో ఆదిలాబాద్ రూరల్ ఎస్‌ఐ వి.వి. విష్ణువర్ధన్‌తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులు, సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.

అరెస్ట్ అయిన నిందితులు:

1. బడే రమేష్ (40)– తండ్రి బుచ్చయ్య, కోలాంగూడ, అంకొలి గ్రామం, ఆదిలాబాద్ రూరల్ మండలం.

2. పుల్లేడు గంగన్న (35) – తండ్రి నారాయణ, అంకొలి గ్రామం, ఆదిలాబాద్ రూరల్ మండలం.

ప్రధాన నిందితుడు:

మడిగం స్వామి – పరారీలో, దర్యాప్తు కొనసాగుతోంది.

________________________________________.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి ఆదిలాబాద్

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE