e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

బట్టు రాహుల్‌కు ఎస్పీ ప్రశంసలు..

విధి నిర్వహణలో నిజాయితీకి గుర్తింపు.. కానిస్టేబుల్ బట్టు రాహుల్‌కు ఎస్పీ ప్రశంసలు

మన భారత్ | ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన యువ కానిస్టేబుల్ బట్టు రాహుల్ విధి నిర్వహణలో చూపిన నిజాయితీ, పారదర్శకతకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. విధి పట్ల అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడంతో ఆయనను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా పోలీసు శాఖలో నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల పట్ల సేవాభావంతో పనిచేసే సిబ్బందిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇలాంటి గుర్తింపులు ఇతర పోలీసు సిబ్బందికి కూడా స్ఫూర్తినిస్తాయని అభిప్రాయపడ్డారు.

కానిస్టేబుల్ బట్టు రాహుల్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై తాంసి గ్రామంలో ఆనందం వ్యక్తమైంది. మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ యువ కానిస్టేబుల్ రాహుల్‌ను అభినందిస్తూ, విధి నిర్వహణలో నిజాయితీని చాటుకోవడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో పనిచేసి మరిన్ని ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఆకాంక్షించారు.

రాహుల్‌కు లభించిన ఈ ప్రశంస జిల్లా యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామ పెద్దలు, స్నేహితులు, స్థానికులు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న రాహుల్‌కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి .

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE