ప్రాథమిక విద్యను కాపాడండి..

Published on

-Advertisement-

రాష్ట్ర  భవిష్యత్తును బలోపేతం చేయండి:

ఉపాధ్యాయ సంఘాలకు ఎస్‌జీటీ శంకర్ బహిరంగ విజ్ఞప్తి

మన భారత్, తలమడుగు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా ప్రభుత్వానికి బలమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ కలవల శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు బహిరంగ లేఖ విడుదల చేశారు.

తెలంగాణ విద్యా వ్యవస్థకు ప్రాథమిక విద్యే పునాదిగా నిలుస్తుందని, పునాది బలంగా ఉంటేనే ఉన్నత విద్యతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత, బహుళ తరగతుల బోధన, ప్రధానోపాధ్యాయుల పోస్టుల లేమి వంటి సమస్యలు విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల ప్రభుత్వం 100 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు అందజేసి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించడం అభినందనీయమైన చర్యేనని, అయితే ఆ లక్ష్యం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ముందుగా తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికీ ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతోనే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధన కొనసాగుతోందని, ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టులు బోధించడం వల్ల విద్యార్థుల అభ్యాస నాణ్యత దెబ్బతింటోందని తెలిపారు.

కంప్యూటర్లు అందించడం మాత్రమే సరిపోదని, వాటిని సమర్థవంతంగా వినియోగించేలా తెలుగు, ఇంగ్లీషు, గణితం వంటి ప్రధాన సబ్జెక్టులకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే డిజిటల్ విద్య, AI ఆధారిత బోధన కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఉపాధ్యాయులకు కల్పించాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధిక శాతం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారని, ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయులు, సబ్జెక్టు వారీగా బోధన, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ, బహుళ తరగతుల బోధన లేకపోవడం వంటి అంశాల వల్లే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇదే స్థాయి విద్యా వాతావరణాన్ని కల్పిస్తే ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికి చేయాల్సిన ప్రధాన సూచనలు

* జీవో నెం. 25ను సవరించి విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించాలి.

* ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలి.

* తెలుగు, ఇంగ్లీషు, గణితం వంటి ప్రధాన సబ్జెక్టులకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలి.

* ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని పోస్టును మంజూరు చేయాలి.

* AI, కంప్యూటర్ విద్య సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఉపాధ్యాయులు, శిక్షణను కల్పించాలి.

* బహుళ తరగతుల బోధన విధానాన్ని దశలవారీగా పూర్తిగా తొలగించాలి.

* ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దే సమగ్ర కార్యాచరణను అమలు చేయాలి.

మన పోరాటం కేవలం ఉపాధ్యాయ పోస్టుల కోసం మాత్రమే కాదు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించేందుకు, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, తెలంగాణ భవిష్యత్తును నిర్మించేందుకు కావాలి. ప్రాథమిక విద్య బలపడితేనే తెలంగాణ బలపడుతుంది. ప్రభుత్వ పాఠశాల బలపడితేనే సమాజం బలపడుతుంది” అని కలవల శంకర్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశంపై ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన కోరారు.

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...