మన భారత్, తాంసి
తాంసిలో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు..
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
తాంసి, జూలై 8 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, తాంసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడల సంతోష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుని జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాంసి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్, ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గంగారెడ్డి, వడ్డాడి సర్పంచ్ గంగాధర్, పలోది సర్పంచ్ నాగిరెడ్డి, పొన్నారి ఉప సర్పంచ్ రామ్‌రెడ్డి, కప్పర్ల ఉప సర్పంచ్ నర్సింలు, మాజీ ఎంపీపీ వన్నెల నరేష్, బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, జిల్లా కార్యదర్శి రామన్న యాదవ్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ధనుంజయ్, అశోక్, ఆత్మ డైరెక్టర్ గంగయ్య, మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ అనుపట్ల సంజీవ్, మాజీ బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి యండి సద్దాం, మౌలానా, చిన్న రామ్‌రెడ్డి, నవీన్, నరేష్, గంగాధర్, హనుమండ్లు, రవి, జీవన్, చిలుకూరి వెంకటరెడ్డి, సురుకుంటి భోజరెడ్డి, నాందేవ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
