లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 

ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన

– వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

తలమడుగు: తలమడుగు మండల కేంద్రానికి సమీపంలోని ఝరి, డోర్లి గ్రామాల వద్ద నిర్మాణంలో నిలిచిపోయిన లో లెవల్ వంతెనలను వెంటనే పూర్తి చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు. వంతెనల పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థుల వివరాల ప్రకారం, ఝరి గ్రామం నుంచి తలమడుగు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మీసేవ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ఈ వంతెన మార్గమే అత్యంత సమీప దారి. అయితే వంతెన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని తెలిపారు.

వర్షాకాలంలో వాగుల్లో నీటి ప్రవాహం పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, రైతులు వ్యవసాయ పనుల కోసం రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చినా పెద్ద చుట్టుదారి పట్టాల్సి వస్తోందని వాపోయారు.

లో లెవల్ వంతెన అందుబాటులో లేకపోవడంతో 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. వంతెన పూర్తయితే తలమడుగు మండల కేంద్రం కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులోకి వచ్చి ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక తలమడుగు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డోర్లి లో లెవల్ వంతెన పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. వంతెనపై పగుళ్లు ఏర్పడటంతో ప్రయాణికులు భయాందోళనల మధ్య ప్రయాణాలు చేయాల్సి వస్తోందన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే ఈ మార్గంలో రాకపోకలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా గ్రామంలోని సీసీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయని, వర్షాల సమయంలో బురద, నీటి నిల్వలతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఝరి, డోర్లి లో లెవల్ వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు, యువత, రైతులు, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

భార్యపై అనుమానంతో కిరాతక హత్య..

మన భారత్, హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ...

ఘనంగా ఫీల్డ్ అసిస్టెంట్ జన్మదిన వేడుకలు

మన భారత్, మొగుళ్లపల్లి: వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించిన మేట్లు, ఉపాధి హామీ కూలీలు మొగుళ్లపల్లి,...

గడువులోగా పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆదిలాబాద్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి...

More like this

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

భార్యపై అనుమానంతో కిరాతక హత్య..

మన భారత్, హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ...

ఘనంగా ఫీల్డ్ అసిస్టెంట్ జన్మదిన వేడుకలు

మన భారత్, మొగుళ్లపల్లి: వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించిన మేట్లు, ఉపాధి హామీ కూలీలు మొగుళ్లపల్లి,...