హైదరాబాద్ చేరిన ఎబోలా వైరస్..

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: 

సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్

హైదరాబాద్: ఆఫ్రికా దేశమైన సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా వైరస్ లేదని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వైద్య అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం, 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల సూడాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఎబోలా ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడిని విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

అనంతరం అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV)లో పరీక్షించగా, ఎబోలా వైరస్ లేదని తేలింది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు గాంధీ ఆస్పత్రి యాజమాన్యానికి అధికారికంగా తెలియజేశారు.

ఎబోలా నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే విదేశాల నుంచి, ముఖ్యంగా అంటువ్యాధులు వ్యాపిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.

ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించబడుతుంది. జ్వరం, తీవ్రమైన బలహీనత, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు.

ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.....

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో...

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.....

More like this