రవితేజ కష్టం ఫలించింది..!

Published on

-Advertisement-

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ

యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ

మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బీ) గ్రామానికి చెందిన గుండెన స్వామి–స్వప్న దంపతుల కుమారుడు గుండెన రవితేజ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో ఆయన ఈ ఘన విజయాన్ని సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు.

చిన్ననాటి నుంచే దేశసేవ పట్ల ఆసక్తి కనబరిచిన రవితేజ క్రమశిక్షణ, కఠోర శ్రమ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అగ్నివీర్ నియామక ప్రక్రియలో విజయవంతంగా ఎంపిక కావడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచాడని గ్రామ పెద్దలు కొనియాడారు.

రవితేజ ఎంపికైన విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు, బంధువులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, పిల్లల ఆసక్తులు, ప్రతిభను గుర్తించి వారికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలు, రక్షణ రంగం, సాంకేతిక రంగాల్లోనూ యువతను ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువతకు రవితేజ విజయగాథ స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావడానికి అవకాశం దక్కడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this