సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పిలుపు.. గ్రామ యువత స్పందన

Published on

-Advertisement-

జామిడి గ్రామంలో పచ్చదనానికి యువత ముందడుగు

మన భారత్, తలమడుగు మండలం:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, గ్రామాలను పచ్చదనంతో నింపాలని జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఇచ్చిన పిలుపుకు గ్రామ యువత మంచి స్పందన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయ మిత్రుడు మునేశ్వర్ సృజయ్ గురువారం జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు.

గ్రామంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం రెండు పండ్ల మొక్కలు నాటాలని సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్పందించిన సృజయ్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చుకుంటూ పండ్ల మొక్కలు నాటడం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు.

గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామ్యమైన మునేశ్వర్ సృజయ్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ప్రధాన ఆధారం కావడంతో ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను పెంచాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్,...

More like this