సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పిలుపు.. గ్రామ యువత స్పందన
జామిడి గ్రామంలో పచ్చదనానికి యువత ముందడుగు మన భారత్, తలమడుగు మండలం: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, గ్రామాలను పచ్చదనంతో నింపాలని జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఇచ్చిన పిలుపుకు గ్రామ యువత మంచి స్పందన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయ మిత్రుడు మునేశ్వర్ సృజయ్ గురువారం జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు. గ్రామంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం...