e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

పారిశుధ్యం అధ్వానం.. స్థానికుల్లో ఆందోళన

మన భారత్ | ఆరికతోట

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలోని ఎస్సీ వీధిలో ఉన్న మంచినీటి ట్యాంకు పరిసర ప్రాంతం పారిశుధ్యం లేక అధ్వానంగా మారింది. గ్రామ ప్రజలకు తాగునీరు అందించే ముఖ్యమైన మంచినీటి ట్యాంకు చుట్టూ చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చ పథం, స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి మారడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, మంచినీటి ట్యాంకు చుట్టూ చాలా రోజులుగా శుభ్రపరిచే చర్యలు చేపట్టకపోవడంతో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి, చుట్టుపక్కల నివసించే ప్రజలు వివిధ రకాల అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ, గ్రామస్థాయిలో కొంతమంది పంచాయతీ అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మంచినీటి వనరుల దగ్గర పరిశుభ్రత లేకపోవడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నాయకులు కిల్లాడ చిన్నారావు స్పందిస్తూ, గ్రామంలోని ఎస్సీ వీధిలో ఉన్న మంచినీటి ట్యాంకు పరిసరాలను వెంటనే శుభ్రపరచాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

గ్రామ ప్రజలు కూడా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, తాగునీటి వనరుల వద్ద పరిశుభ్రత పాటించడం అత్యవసరమని వారు పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE