పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

Published on

-Advertisement-

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన

-సర్పంచ్ నైనకంటి మమత

మన భారత్,మొగుళ్ళపల్లి:

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు పచ్చగా ఉంటేనే..ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తారని, పచ్చదనంతో పాటు పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు పిడిసిల్ల పాలకవర్గానికి పూర్తిగా సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామ సర్పంచ్ నైనకంటి మమత ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామంలోని రోడ్లకిరువైపులా గ్రామ ప్రజలతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలోని ప్రజలందరూ ఒక్కొక్కరు రెండు మొక్కల చొప్పున గ్రామంలోని రోడ్లకిరువైపులా, ఇంటి పరిసరాలలో నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. చెట్లను కొట్టివేయడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడి..ప్రజలకు రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొర దెబ్బ తినడంతో..సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడి ప్రజలు వివిధ రోగాల భారీన పడుతున్నారని, అదేవిధంగా వర్షాలు కూడా సమృద్ధిగా కురవడం లేదని, దీంతో రైతుల పంటలకు నీరు లేక, భూములన్ని ఎడారిగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కాబట్టి ప్రజలంతా హరితహారంలో పాల్గొని మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాదం చైతన్య, వార్డు మెంబర్లు కోండ్ర శోభ, కట్కూరి ఐలయ్య, వంగ విజయ, పంచాయతీ కార్యదర్శి మాలతి, ఫీల్డ్ అసిస్టెంట్ సరిగోమ్ముల శోభ, గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీరు రిపోర్టర్ గా పని చేయాలని ఆసక్తిగా వుందా.. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this