e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

పగడ్బందీగా జనాభా గణన నిర్వహించాలి:

మన భారత్, తలమడుగు

దేవాపూర్ గ్రామంలో ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన అధికారులు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరుగుతున్న జనాభా గణన ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ రాజమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ల తో మాట్లాడిన తహశీల్దార్, ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, జనాభా గణాంకాలు మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో మూడు రోజుల పాటు ఉండి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా జనాభా గణన చేపట్టాలని, ప్రతి వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగితే భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు కూడా అధికారులకు సహకరించి సరైన సమాచారం అందించాలని తహశీల్దార్ కోరారు. జనాభా గణన ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, వనరుల కేటాయింపు మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోరండ్ల సంతోష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE