మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ : 

జిల్లా వ్యవసాయ రంగానికి కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి నియామకం పొందారు. ఈ సందర్భంగా ఆయన తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

రైతు కుటుంబానికి చెందిన తాను, గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో సేవలందిస్తూ వచ్చినట్లు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చిన తన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మరియు ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో రైతుల సంక్షేమం కోసం, మార్కెట్ యార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రైతులకు మెరుగైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటానని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ వ్యవస్థను బలోపేతం చేస్తానని తెలిపారు.

రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తన ప్రాధాన్యతగా భావిస్తానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this