e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి పల్లి గ్రామాల పరిధిలో రైతులు కష్టించి పండించిన మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 17 ఎకరాల పంట నష్టపోయింది.

స్థానికుల వివరాల ప్రకారం, శనివారం విద్యుత్ వైర్లు ఒకదానికొకటి ఆనుకోవడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని మొక్కజొన్న పొలాలను చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్ని తీవ్రరూపం దాల్చడంతో రైతులు చూస్తుండగానే పంట కాలిపోయింది. ఎంతో శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలోనే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు బోరున విలపించారు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాన్ని ముందుగానే నివారించే చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వారు వాపోయారు.

విషయం తెలిసిన వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం ఘటనాస్థలానికి చేరుకుని దగ్ధమైన పంటలను పరిశీలించారు. ఆయనతో పాటు మండల తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి, ఎంపీడీవో గొడిశాల సురేందర్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి పి. సురేందర్ రెడ్డి, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, విద్యుత్ శాఖ అధికారులు కూడా ఘటన స్థలాన్ని సందర్శించారు.

అధికారులు రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు సేకరించారు. బాధిత రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది. రైతులు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE