అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు(తాంసి ):

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు నాగర్తి విఠ్ఠల్‌కు చెందిన రెండు ఎకరాల జొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు.

స్థానికుల సమాచారం మేరకు, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట ఒక్కసారిగా మంటలకు ఆహుతైంది. గాలి తీవ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే మొత్తం పొలం కాలిపోయింది. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతు విట్టల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కౌలు రైతు కావడంతో అతనికి ఈ నష్టం మరింత భారంగా మారింది.

అదేవిధంగా, సమీపంలో ఉన్న సిరిగిరి లక్ష్మీపతి, విశ్వనాథ్‌కు చెందిన వ్యవసాయ పొలాల్లో కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని నీటిపారుదల పైపులు కాలిపోయాయి. దీంతో వారికి కూడా ఆర్థిక నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఎండ తీవ్రత కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గ్రామస్తులు, బాధిత రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపరిహారం అందించి కౌలు రైతుకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this