అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..
మన భారత్, తలమడుగు(తాంసి ): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు నాగర్తి విఠ్ఠల్కు చెందిన రెండు ఎకరాల జొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. స్థానికుల సమాచారం మేరకు, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట ఒక్కసారిగా మంటలకు ఆహుతైంది. గాలి తీవ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే...