దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

Published on

-Advertisement-

మన భారత్ | ఆదిలాబాద్ : 

ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉట్నూర్‌లోని ఎస్బీఐ ఆర్ శెట్టి కేంద్రంలో పది రోజుల పాటు నిర్వహించిన ఈ EDP (Entrepreneurship Development Program) శిక్షణ ముగింపు సందర్భంగా పాల్గొన్న దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యోగస్తుల వికలాంగుల సంఘ ఉపాధ్యక్షులు చిలుకూరి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే స్థానిక సర్పంచ్ సెడుము, ఆర్ శెట్టి సంచాలకులు ఆశన్న, సామాజిక సేవకులు కామ్రే దేవి దాస్ తదితరులు పాల్గొని శిక్షణ పొందిన వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ షిండే మాట్లాడుతూ, దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా తమలోని నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఎదగాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ EDP శిక్షణ ద్వారా పొందిన సర్టిఫికెట్లు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ రుణాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలను పొందడంలో ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగులకు ఆర్థికంగా బలపడే మార్గాలను చూపించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్ సెడుము, ఆర్ శెట్టి సంచాలకులు ఆశన్న, సామాజిక కార్యకర్త అందుల దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, వారు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this