ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.

వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు నిర్వహిస్తూ, మిగతా సమయాల్లో ఎండ తీవ్రతకు దూరంగా ఉండాలని కూలీలకు సూచించారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పెనుకుల గట్టన్న మాట్లాడుతూ, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ మొగిలి, ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూలీలు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి  నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్...

More like this