ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..
మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, ఉపసర్పంచ్ నేర్పాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎండలో కష్టపడుతున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు...