తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు అడుగుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు..

తలమడుగు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ పథకం పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి సమయానికి సహాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చెక్కుల జారీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను వేగంగా పరిశీలించి, త్వరితగతిన చెక్కులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు అభిరాంరెడ్డి, ఎమ్మార్వో రాజ్ మోహన్, ఎంపీడీవో శేఖర్, సర్పంచ్ ఎలుగు రాజన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతమవుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this