కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ :

లోక్‌సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడం బాధాకరమని అన్నారు. మహిళా సాధికారతకు ఇది కీలకమైన అడుగని పేర్కొంటూ, ఆడబిడ్డలకు రాజకీయ రంగంలో అవకాశాలు పెరిగేలా చేసే ఈ బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి, సమానత్వం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని, మహిళా సాధికారతకు క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి దక్కకుండా చూడాలనే ఉద్దేశంతో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, మహిళల భాగస్వామ్యం పెరగడం దేశ పురోగతికి దోహదం చేస్తుందని తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ అంశం రాష్ట్రంలో కూడా చర్చనీయాంశంగా మారింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this