e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం

-మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రామ్

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

మన భారత్, మొగుళ్ళపల్లి:

ఢిల్లీలో తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నీట్ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు నడిగోటి రాము ఖండించారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న న్యాయ సమ్మతమైనదేనని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు ప్రతి విద్యార్థికి ఉందని, అలాంటి వారిపై బల ప్రయోగం చేయడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అహంకార పాలనకు నిదర్శనమనీ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేసే విధానాన్ని విరమించుకోవాలని విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ కు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE