కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేవైఎం..!
మన భారత్, ఆదిలాబాద్ : లోక్సభలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లును కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించడం బాధాకరమని అన్నారు. మహిళా సాధికారతకు ఇది కీలకమైన అడుగని పేర్కొంటూ, ఆడబిడ్డలకు రాజకీయ రంగంలో అవకాశాలు పెరిగేలా...