ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్డీవో పీడీ

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలు తీరు పై డిఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్ సమగ్రంగా పరిశీలించారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో పర్యటించిన ఆయన, ఉపాధి హామీ కూలీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వేతనాల వివరాలను తెలుసుకున్నారు. కూలీల సమస్యలు, పనుల అమలు విధానం పై సమాచారం సేకరించి అవసరమైన సూచనలు చేశారు.

అనంతరం సాయి లింగి, రూయ్యడి గ్రామాలను సందర్శించిన రవీందర్ రాథోడ్, గ్రామాల్లో జరుగుతున్న ఈజీఎస్ పనుల ప్రదేశాలను తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షిస్తూ, ఎన్ఎంఎంఎస్ (NMMS) సిబ్బంది హాజరు నమోదు విధానాన్ని పరిశీలించారు. పనుల్లో పారదర్శకత, సమర్థత ఉండేలా క్షేత్ర స్థాయి సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరింత మంది కార్మికులను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ పర్యటనలో మండల ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా పనుల అమలులో పారదర్శకత, క్రమబద్ధత పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this