e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇలా..

మన భారత్, జడ్చర్ల :

జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదివారం మిడ్జిల్ మండలంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరియు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు మిడ్జిల్ మండల కేంద్రంలోని PACS కార్యాలయంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మసిగుండ్లపల్లి గ్రామంలో జరుగుతున్న శివపార్వతుల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

తర్వాత 12:30 గంటలకు జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 1:30 గంటలకు సింగం దొడ్డి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) పైప్‌లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు గుడిగానిపల్లి మాజీ సర్పంచ్ కృష్ణ కుటుంబానికి చెందిన కార్యక్రమంలో మిడ్జిల్ కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్‌లో హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు జడ్చర్ల మండలంలోని కురువపల్లి పలుగుతాండకు చెందిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ మృతి పట్ల ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఇంకా తదుపరి కార్యక్రమాలు కొనసాగనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులు, అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE