ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి):

తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సభలో ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న సేవల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లు ఆకర్షణీయంగా నిలిచి, మహిళలు మరియు బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను తెలియజేశారు.

అనంతరం గర్భిణి స్త్రీలకు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా సీమంతం నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ సభలో ఆత్మ ఛైర్మన్ నారాయణ, ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో లక్షీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధుల గైర్హాజరు పై స్థానికంగా చర్చలు జరగగా, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని ప్రజలు కోరుతున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this