ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!
మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సభలో ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు...