e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బహుజన ఐక్యత ర్యాలీకి తరలిరండి: సుకుమార్

మన భారత్, ఆదిలాబాద్: 

సామాజిక సమానత్వం, విద్యా హక్కులు, బహుజనుల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 200వ జయంతి వేడుకలు ఏప్రిల్ 11, 2026 శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బహుజన వాద్యులందరూ సకుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు.

జయంతి కార్యక్రమాలు ఉదయం 9:30 గంటలకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్, దస్నాపూర్‌లోని ఫూలే విగ్రహానికి పూలమాలంకరణ జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకు భూక్తాపూర్‌లోని ఫూలే చౌక్ వద్ద జెండా ఆవిష్కరణతో పాటు చిత్రపటానికి పూలమాలలు అర్పిస్తారు.

తరువాత ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జయంతి సభ నిర్వహించబడుతుంది. ఈ సభలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మహాత్మా ఫూలే ఆశయాలపై ప్రసంగాలు చేయనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటలకు భోజనం అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుండి ప్రారంభమయ్యే “బహుజన ఐక్యత ర్యాలీ” కలెక్టరేట్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ మార్గాల మీదుగా బుక్తాపూర్‌లోని ఫూలే చౌక్ వరకు కొనసాగుతుంది.

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని బహుజన ఐక్యతను చాటుకోవాలని, సామాజిక న్యాయం సాధన దిశగా ముందుకు సాగాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మహాత్మా ఫూలే దంపతుల ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE