e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

తుప్పు పట్టిన వ్యాన్.. విద్యార్థుల రవాణా.?

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి:

జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తుప్పు పట్టిన వాహనాల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం పట్ల ఎంఈఓ లింగాల కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలల తనిఖీలకు వెళ్లిన సందర్భంగా ముల్కలపల్లి గ్రామంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

తనిఖీలలో భాగంగా పలు వాహనాలను పరిశీలించిన ఎంఈఓ, అవి తుప్పు పట్టినవిగా ఉండటమే కాకుండా, అందులో 40 నుంచి 50 మంది విద్యార్థులను గుమికూడ్చి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం పై డ్రైవర్లు, పాఠశాల నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

వాహనాలకు రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తుప్పు పట్టిన వ్యాన్లలో విద్యార్థులను తరలించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే రవాణా, విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE