పిప్రిలో సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన..

Published on

-Advertisement-

మన భారత్, బజార్ హత్నూర్:

ఈనెల 6వ తేదీన బజార్ హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. సభా స్థలంలో జరుగుతున్న పనులను సవివరంగా పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలని, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ, ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ విజయవంతం కావాలని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this