స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో పాటు, వాహనాలు వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాల ముప్పు అధికమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, ఈ కూడలి ప్రాంతంలో నిత్యం కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు రోడ్డు దాటే సందర్భాలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా, ఉదయం, సాయంత్రం సమయంలో పొలాలకు వెళ్లే రైతులు కూడా ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు.

అయితే, పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు అనే తేడా లేకుండా డ్రైవర్లు అధిక వేగంతో కూడలి వద్దకు చేరుకోవడం వల్ల ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రధాన కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల వేగాన్ని తగ్గించి, ప్రమాదాలను నివారించవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this