స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో పాటు, వాహనాలు వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాల ముప్పు అధికమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, ఈ కూడలి ప్రాంతంలో నిత్యం కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు రోడ్డు...