e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

పసిడి ధరలు పడిపోతున్నాయి ఎందుకో.?

మన భారత్, న్యూఢిల్లీ:

సాధారణంగా షేర్ మార్కెట్లు పడిపోతే పెట్టుబడిదారులు భద్రమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ బంగారం, వెండిలో పెట్టుబడులు పెడతారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ట్రెండ్‌కు విరుద్ధంగా బంగారం ధరలు పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా వడ్డీ రేట్ల పెరుగుదలపై ఉన్న అంచనాలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం (Inflation) పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే స్థిర లాభాలను ఇచ్చే బాండ్లు (Bonds) పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుతాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది.

ఇక ఇటీవల బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయిలను తాకడం కూడా పతనానికి ఒక కారణంగా చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ (Profit Booking) చేయడం ప్రారంభించారు. దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు దిగివచ్చాయి.

అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ కొరత కూడా ప్రభావం చూపుతోంది. క్యాష్ అవసరం పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం వంటి ఆస్తులను విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి బంగారం ధరలు తగ్గడానికి దారితీస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముందు రోజుల్లో వడ్డీ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై బంగారం ధరల దిశ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE