పసిడి ధరలు పడిపోతున్నాయి ఎందుకో.?
మన భారత్, న్యూఢిల్లీ: సాధారణంగా షేర్ మార్కెట్లు పడిపోతే పెట్టుబడిదారులు భద్రమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ బంగారం, వెండిలో పెట్టుబడులు పెడతారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ట్రెండ్‌కు విరుద్ధంగా బంగారం ధరలు పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా వడ్డీ రేట్ల పెరుగుదలపై ఉన్న అంచనాలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం (Inflation) పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ...