e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ.!

మన భారత్, ఎంటర్టైన్మెంట్:

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత దాదాపు 14 ఏళ్లకు ఈ కాంబో మళ్లీ కలిసి రావడంతో సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే మారిన కాలానికి తగ్గట్టు కథ, కథనం కూడా మారిందా అనే ప్రశ్నకు సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

కథ, కథనం

సినిమా కథ పరంగా చూస్తే ఇది పూర్తిగా కమర్షియల్ ఫార్ములా కథ. ఒక ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్, రాజకీయ కుట్రలు పన్నే విలన్‌ను ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడం ప్రధాన నేపథ్యం. సీఎం కుర్చీ కోసం విలన్ చేసే ఎత్తుగడలను హీరో ఎలా అడ్డుకుంటాడు అనేదే కథ సారం. గబ్బర్ సింగ్ తరహాలోనే హీరోయిజం, పంచ్ డైలాగులు, ఫైట్లు, పాటలతో సినిమా సాగుతుంది. కానీ కథలో కొత్తదనం తక్కువగా కనిపిస్తుంది.

హీరో ఇంట్రడక్షన్, పోలీస్ స్టేషన్ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ ఇవి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ద్వారా కథలో ఎమోషన్ జోడించే ప్రయత్నం చేసినా, అది అంతగా ప్రభావం చూపించలేకపోయింది.

ఫస్ట్ హాఫ్ హైలెట్స్

మొదటి భాగంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అభిమానులకు నచ్చే మేనరిజమ్స్, స్టెప్పులు, సీన్స్ బాగా వర్క్ అవుతాయి. రాశీ ఖన్నా ట్రాక్ కేవలం వినోదం కోసం మాత్రమే వాడినట్లు అనిపిస్తుంది.

సెకండాఫ్ పరిస్థితి

సెకండాఫ్‌లో శ్రీలీలతో లవ్ ట్రాక్, పాత పాటల రీమిక్స్‌లు, ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ‘తొలి ప్రేమ’ పాట రీమిక్స్, ఇతర పాత సాంగ్స్ రిఫరెన్స్‌లు నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తాయి. అయితే కథ ముందుకు తీసుకెళ్లడంలో ఇవి పెద్దగా సహాయపడవు. క్లైమాక్స్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, చివరికి అది కూడా సాధారణంగానే ముగిసిన భావన కలిగిస్తుంది

నటీనటులు, సాంకేతిక విభాగం

ప‌వ‌న్ క‌ల్యాణ్ తన ఇమేజ్‌కు తగ్గట్టుగా అద్భుతంగా కనిపించారు. అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు అందించారు. శ్రీలీల ఓకే అనిపిస్తే, రాశీ ఖన్నా పాత్రకు బలం తక్కువగా ఉంది. విలన్‌గా పార్ధిబన్ నటన ఆకట్టుకుంటుంది.

సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ‘దేఖ్ లేంగే’ పాట మంచి స్పందన తెచ్చుకుంటుంది. అయితే నేపథ్య సంగీతం సాధారణంగానే అనిపిస్తుంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కొత్తదనం కనిపించదు.

మొత్తం విశ్లేషణ

మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పూర్తి స్థాయిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. కథలో కొత్తదనం లేకపోయినా, హీరో ఎలివేషన్స్, డైలాగులు, ఫ్యాన్స్‌కి కావాల్సిన మసాలా అంశాలు సినిమాను నిలబెట్టాయి. ఫ్యాన్స్‌కు ఇది పండగలా అనిపిస్తే, సాధారణ ప్రేక్షకులకు మాత్రం సాదాసీదా అనుభవంగా మిగులుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE