రూ.25 వేల బహుమతి గెలుచుకోండి.!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

భారత జాతీయ గేయం వందే మాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్విజ్ పోటీని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా యువతలో దేశభక్తి భావనను పెంపొందించడం మరియు చరిత్రపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ క్విజ్‌ను కేంద్ర ప్రభుత్వ పౌర భాగస్వామ్య వేదిక అయిన MyGov వెబ్‌సైట్‌లో నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి క్విజ్‌లో పాల్గొనవచ్చు. క్విజ్‌లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 సెకన్లలోపు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలును అందజేయనున్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.15 వేలూ, రూ.10 వేలూ బహుమతులు లభిస్తాయి. అదనంగా మరో 150 మందికి ప్రోత్సాహకంగా రూ.3,000 చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.

వెబ్ సైట్: https://quiz.mygov.in/quiz/vande-mataram-150-years-quiz/

ఈ క్విజ్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. విద్యార్థులు, యువతతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

ఈ పోటీలో పాల్గొనే చివరి తేదీ ఏప్రిల్ 15గా నిర్ణయించారు. దేశ చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ క్విజ్‌లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this