అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:

తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉన్న ZPHS పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కిచెన్ షెడ్ , బాత్రూం నిర్మాణ పనులకు సర్పంచ్ పోరండ్ల సంతోష్ శ్రీకారం చుట్టారు. పాఠశాల మౌలిక వసతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షలు, అదనంగా మరొక పాఠశాలలో రూ.4 లక్షలతో విస్తరణ పనులు, అలాగే టాయిలెట్ నిర్మాణానికి రూ.2 లక్షలు కేటాయించగా మొత్తం రూ.10 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహణ సులభ తరం కావడంతో పాటు, పరిశుభ్రత పరంగా కూడా మెరుగైన వాతావరణం కలగనుంది.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్, ఉప సర్పంచ్ మేకల శ్రీరాం, ZP హెడ్మాస్టర్ నర్సయ్య, రేగుల మోహన్, BRS నాయకులు పులవైనా జెలేందర్ యాదవ్, సంగర్తి నారాయణ, తలమడుగు యాదవ సంఘం అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ యాదవ్, నాయిని నవీన్, చింతల రాజన్న, పాశపు అజేయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరారు.

పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this