సంక్రాంతి నెంబర్ వన్ సినిమా ఏదంటే..?

Published on

-Advertisement-

బాక్సాఫీస్ బరిలో టాప్ స్టార్ల పోటీ.. చివరికి అగ్రస్థానం ఎవరిది?

మన భారత్, తెలంగాణ:

చాలా ఏళ్ల తరువాత ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో టాప్ స్టార్లతో పాటు పేరు తెచ్చుకున్న తారల చిత్రాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. ఈసారి ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి కానుకలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎవరికి వారు తమ చిత్రాల వసూళ్లను ప్రకటించుకుంటూ హడావుడి చేస్తుండగా, వాటిలో అసలు సంక్రాంతి నెంబర్ వన్ సినిమా ఏది? అన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా పెట్టుబడికి తగిన రాబడి తెచ్చుకున్న చిత్రాలనే విజయవంతమైనవిగా పరిగణిస్తారు. అదే విధంగా వసూళ్లను, లాభనష్టాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంక్రాంతి బాక్సాఫీస్‌లో అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలిచిన చిత్రం చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ అని ట్రేడ్ పండిట్స్ స్పష్టం చేస్తున్నారు.

ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఆ తరువాత కూడా అదే ఊపు కొనసాగిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథనం, కామెడీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. అంతేకాదు, మరో స్టార్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించడం కూడా సినిమాకు అదనపు ప్లస్‌గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ను సంక్రాంతి నెంబర్ వన్ సినిమాగా ట్రేడ్ పండిట్స్ డిక్లేర్ చేశారు.

ఇక రెండో స్థానానికి వచ్చేసరికి పోటీ కాస్త ఆసక్తికరంగా మారింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’కంటే మూడు రోజులు ముందే విడుదలైన ప్రభాస్ నటించిన ‘ద రాజాసాబ్’ వసూళ్ల పరంగా బలంగా కనిపించినా, మొదటి రోజు నుంచే టాక్ అంతగా అనుకూలంగా రాలేదు. అయినా ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.201 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే భారీ బడ్జెట్ కారణంగా పెట్టుబడి–రాబడి లెక్కలు చూసినప్పుడు ఈ చిత్రం నష్టాల బాటలోనే ఉందని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి.

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఆయన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, వినోదాత్మకంగా తెరకెక్కింది. సినిమా టాక్ బాగున్నప్పటికీ, వసూళ్ల పరంగా ఆశించిన స్థాయిలో రాణించలేదని సమాచారం. మరోవైపు నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు’ టాక్ ఎలా ఉన్నా, వసూళ్లలో మాత్రం సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. మొదటి రోజునే రూ.22 కోట్ల వసూళ్లు సాధించి, లాభాల బాటలో పయనిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతి బరిలో చివరగా దూకిన చిత్రం శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’. జనవరి 14 సాయంత్రం షోలతో ప్రారంభమైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే మంచి టాక్ వచ్చింది. అన్ని కేంద్రాల్లో స్టడీ కలెక్షన్లతో సాగుతూ, టాక్ పరంగా చాలా చిత్రాలను మించిందని విశ్లేషకులు అంటున్నారు. వసూళ్ల పరంగా మాత్రం చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’కు గట్టి పోటీగా నిలిచే స్థాయికి చేరలేదన్నది వాస్తవం. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో రెండో స్థానానికి ఈ సినిమానే ప్రధాన పోటీదారుగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా వసూళ్ల పరంగా ఆర్డర్ ఖరారు కావాలంటే ఇంకా వారం రోజుల వరకు వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ సంక్రాంతి బాక్సాఫీస్ నెంబర్ వన్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ అన్న విషయంలో ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...