e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు

సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు

మన భారత్, తెలంగాణ:

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు అదనంగా మరో పదకొండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్–విజయవాడ మార్గంలో నడిచే ఈ అదనపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక హాల్ట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఆగనున్న రైళ్లు:

మచిలీపట్నం–బీదర్ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, కాకినాడ టౌన్–లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్, సాయినగర్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, సాయినగర్–కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–ముంబై ఎన్టీటీ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–సాయినగర్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–కాకినాడ టౌన్ కాకినాడ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్, ముంబై–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, బీదర్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆగే రైళ్లు:

సికింద్రాబాద్–గూడూరు–సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి–కాకినాడ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీభ్ రథ్, సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి–సికింద్రాబాద్–తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ నెల 20వ తేదీ వరకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ అదనపు రైళ్లు ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE