వాట్సాప్ లో ఇంటర్ హాల్ టికెట్స్..!

Published on

-Advertisement-

తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఇంటర్ హాల్‌టికెట్లు పంపిణీ

మన భారత్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లలో తప్పులు సవరించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు నేరుగా ఇంటర్ హాల్‌టికెట్లను పంపించనుంది.

ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. పరీక్షలకు సుమారు 45 రోజుల ముందుగానే హాల్‌టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపిస్తామని తెలిపారు. దీంతో హాల్‌టికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టులు, పరీక్షా కేంద్రం వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్లను తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపించనున్నట్లు ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. హాల్‌టికెట్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ నిర్ణయంతో విద్యార్థులు చివరి నిమిషంలో ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గడంతో పాటు, పరీక్షల నిర్వహణ మరింత సక్రమంగా సాగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ -బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను...

More like this