వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం..

Published on

-Advertisement-

చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు : ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, ఆదిలాబాద్:

గ్రామాభివృద్ధి పేరుతో ఏర్పాటు చేస్తున్న వీడీసీలు (విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీలు) రాజ్యాంగ విరుద్ధమని, అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టంచేశారు. ప్రజల హక్కులను హరించే విధంగా ఎవరు వ్యవహరించినా చట్టం తన పని చేస్తుందని హెచ్చరించారు.

వీడీసీల పేరుతో అక్రమ వసూళ్లు, బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలపై అనధికారిక అనుమతులు ఇవ్వడం పూర్తిగా నేరమని ఎస్పీ తెలిపారు. ఇటువంటి చర్యలు గ్రామాల్లో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

ప్రభుత్వ నిబంధనలు, స్థానిక సంస్థల అధికార పరిధిని పక్కనపెట్టి వీడీసీలు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో ప్రజలను భయపెట్టి లేదా ఒత్తిడికి గురిచేస్తే అది నేరమేనని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన విధానాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని సూచించారు.

వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు ఎలాంటి భయాలు లేకుండా జిల్లా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Latest articles

బస్సు పోయి… ఆటో వచ్చె.!

మన భారత్, తెలంగాణ: ఆర్టీసీ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని జిల్లాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణంగా రద్దీగా ఉండే...

ప్రపంచంలోనే 14వ స్థానంలో మన ఆదిలాబాద్

మన భారత్, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని 100...

43°C దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి

మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర...

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ

మన భారత్, బీంపూర్: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ప్రహరీ గోడ నిర్మాణానికి శుభారంభం...

More like this