పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు దరఖాస్తు!

Published on

-Advertisement-

పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు దరఖాస్తు!

మన భారత్, మహారాష్ట్ర:మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట, పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు అప్లై చేయడం సంచలనంగా మారింది. అసలు కారణం ఏమిటంటే… పెళ్లికి ముందు చెప్పాల్సిన కీలక విషయం దాచిపెట్టడమే.

పుణేకు చెందిన ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన తర్వాతే భర్త తన వృత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించాడు. తాను మర్చంట్ నేవీలో డాక్టర్‌గా పని చేస్తున్నానని, డ్యూటీకి వెళ్తే ఆరు నెలల పాటు ఓడలోనే ఉండాల్సి వస్తుందని భార్యకు చెప్పాడు.

ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని భార్య ప్రశ్నించడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు ఇలాంటి కీలక విషయాలు చర్చించాల్సిందేనని ఆమె స్పష్టం చేసింది. పరస్పర అవగాహన లేకుండా కలిసి జీవించడం కష్టమని భావించిన ఇద్దరూ, పెళ్లైన 24 గంటల్లోనే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “పెళ్లికి ముందు నిజాలు దాచిపెట్టడం భవిష్యత్‌ను నాశనం చేస్తుంది”, “వృత్తి, జీవనశైలి వంటి అంశాలు ముందే స్పష్టంగా చెప్పుకోవాలి” అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రేమైనా, పెళ్లైనా… పారదర్శకతే బంధానికి పునాది అని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

#Divorce #MarriageNews #PuneNews #Maharashtra #RelationshipTruth #ViralNews #ManBharat

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this