కోతుల బెడద పరిష్కరించాలని డిమాండ్

Published on

-Advertisement-

కోతుల బారిన పడుతున్న గూడూరు గ్రామం  ప్రజలు తీవ్ర ఇబ్బందులు

మన భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:  ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కోతుల ఉచ్చాటన సమస్య తీవ్రరూపం దాల్చింది. గత రెండు నెలలుగా గ్రామంలో కోతులు దాడులు చేస్తూ గ్రామ ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. స్కూల్‌కి వెళ్లే చిన్న పిల్లలపై దాడులు చేయడం, ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేయడం, ఆహార పదార్థాలను దోచుకోవడం వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం  కోతుల దాడులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో మహిళలు, వృద్ధులు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లు, దుకాణాలు, స్కూల్ ప్రాంగణాలు, ఇళ్ల పైకప్పులు కోతుల తాటికి గురవుతున్నాయి.

ఈ సమస్య పరిష్కారానికి గ్రామ పెద్దలు, సంఘ నాయకులు ముందుకు వచ్చారు. మాజీ సర్పంచ్ చాకలి రమేష్, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్, వెలమ సంఘం అధ్యక్షులు చీటి గోపాల్ రావు, గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర సంతోష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చాకలి పర్వతాలు, ఇతర సంఘ ప్రతినిధులు సమావేశమై పరిష్కార మార్గాలను చర్చించారు.

ఈ సందర్భంగా పోతుగల్ గ్రామానికి చెందిన పెద్దమల సంఘం సభ్యుడు కేశవులు ను పిలిపించి గ్రామంలో కోతల బారి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి సంఘం నుంచి సహకారం తీసుకుని ప్రతి నెల రూ.15,000/- నిధి సమకూర్చి కుక్కలను నియమించి కోతుల బారినుంచి గ్రామాన్ని రక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ  “ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని” విజ్ఞప్తి చేశారు.

Latest articles

పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్

మన భారత్ ,ఆదిలాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు...

అగ్ని ప్రమాదంలో జొన్న పంట బూడిద..

మన భారత్, తలమడుగు(తాంసి ): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన...

అక్కను వదిలి.. చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

మన భారత్, గద్వాల: బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటన ఒక మైనర్ బాలిక జీవితాన్ని...

దళిత రత్న పురస్కార గ్రహీతకు అభినందనలు

మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా...

More like this