e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా: -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా:

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్ళపల్లి: నవంబర్ 28,(మన భారత్):

మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కార్యక్రమంలో, ఇందిరమ్మ చీరల పంపిణీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రహదారుల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి వసతులు, గ్రామాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను, వాటి కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని గ్రామ ప్రజలకు వివరించారు.అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం ద్వారా గ్రామ పాలన మరింత సులభతరం అవుతుందని, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో గ్రామ ప్రజలకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు బాలింతలకు అవసరమైన సేవలు మరింత మెరుగ్గా అందుతాయని తెలిపారు.గ్రామాల అభివృద్ధే నియోజకవర్గ అభివృద్ధికి పునాది అని, ప్రజా ప్రభుత్వం సహకారంతో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భూపాలపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎండి రఫీ, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కట్టంగూరి రామ్ నర్సింహారెడ్డి , జిల్లా నాయకులు నడిగోటి రాము తక్కలపల్లి రాజు, ఏలేటి సదాశివరెడ్డి ,టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్,వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు ,వివిధ శాఖల అధికారులు,మండల నాయకులు, రైతులు, లబ్దిదారులు ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE