e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

పదో తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..

ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు రూ.10 వేల పారితోషికం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, ఎల్లారెడ్డిపేటకు చెందిన ఎన్నారై బొమ్మకంటి సతీష్ కుమార్ గుప్తా నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న సతీష్ గుప్తా, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గత సంవత్సరం నుంచి నగదు పారితోషికం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా తన పాఠశాలలో చదువుతున్న నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ క్రమశిక్షణ, కష్టపడే తత్వం అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సతీష్ గుప్తా సూచించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి సమాజానికి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా పట్టుదలతో విద్యనభ్యసించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గర్గుల స్వామి, ముత్యాల శ్రీనివాస్, రెడ్డి శంకర్, శ్రీకాంత్, శైలజ, బికునాయక్, అంజన్ రెడ్డి, వేణుగోపాల్, రాజు, మధుసూదన్, ఇబ్రహీం, భవిత, స్వాతి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ ఒగ్గు మహేష్ చంద్ర రాజన్న సిరిసిల్ల  జిల్లా స్టాఫ్ రిపోర్టర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE